![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -196 లో....సుమిత్ర కాంచన ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. మీపై కోపంగా ఉంది జ్యోత్స్నని మీ ఇంటికోడలిని చేసుకుంటానని మాట తీసుకోవడం మీ తప్పు.. ఇవ్వడం మీ అన్నయ్య తప్పు.. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు నా కూతురు బాధపడుతుందని కాంచన తో తన బాధ పంచుకుంటుంది సుమిత్ర. నేను నా కూతురు లాగా మాట్లాడలేను.. కార్తీక్, దీప లకి రాసి ఉంది.. అందుకే పెళ్లి జరిగిందిని సుమిత్ర అంటుంది. మీరు రేపు ఫంక్షన్ కి ఎలాగైనా రావాలి.. రానని మాత్రo చెప్పకండి వదిన ఎదరు చూస్తూ ఉంటానని అని కాంచన అంటుంది.
నాకు మీరు ఎంత ఇష్టమంటే.. నా బాధ మీతో చెప్పుకునేంత అని సుమిత్ర అనుకుంటుంది. ఆ తర్వాత శౌర్య తన ఫ్రెండ్స్ తో ఐస్క్రీమ్ తింటూ మాట్లాడుతుంది. ఫంక్షన్ కి రండీ మా నాన్నని పరిచయం చేస్తానని అంటుంది. మరొక వైపు కొడుకు, కోడలికి గిఫ్ట్ తీసుకుందామని కావేరి అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. కాంచన అక్క.. నా కూతురిని తన కూతురు అనుకున్నప్పుడు.. నేను తన కొడుకుని కొడుకు అనుకోవాలి కదా అనగానే.. శ్రీధర్ చిరాకు పడతాడు. ఆ తర్వాత శౌర్య తన ఫ్రెండ్స్ తో తొక్కుడు బిళ్ల ఆడుతుంటే ఓడిపోతుంది. మా అమ్మ బాగా ఆడుతుంది అని శౌర్య తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. అప్పుడే దీప వస్తుంది ఆడమని శౌర్య రిక్వెస్ట్ చెయ్యగా దీప ఆడుతుంది. అప్పుడే కార్తీక్ చూసి ఇది శౌర్య పని అనుకుంటా అని దీప ఆడుతుంటే చూస్తుంటాడు. ఆ తర్వాత కార్తీక్ రాగానే శౌర్య తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తుంది.
ఆ తర్వాత భోజనం రెడీ అయిందని కాంచన దగ్గరికి వెళ్తుంది దీప. ముందు మీ ఆయనకి పెట్టమని కాంచన అంటుంది. బాగా అన్నారు అమ్మ అని అనసూయ అనగానే.. నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాగే అంటుండని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఫోన్ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడే దీప వస్తుంది. ఇద్దరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. మళ్ళీ డాష్ ఇచ్చుకోండి లేదంటే కొమ్ములు వస్తాయని శౌర్య అనగానే మళ్ళీ డాష్ ఇచ్చుకుంటారు. తరువాయి భాగం లో మీరు నాకు అమ్మనాన్నలు కాదు.. అమ్మనాన్నలంటే ఇలా ఉండాలంటు ఒక స్కెచ్ ఆర్ట్ చూపిస్తుంది. అందులో అమ్మనాన్న మధ్యలో ఒక పాప ఉంటుంది. అది చూపించి నేను ఇలా ఉండాలి అనుకోవడం తప్పా.. ఎందుకు రిసెప్షన్ కి ఒప్పుకోవడం లేదని శౌర్య ఏడుస్తుంటే.. సరే అని దీప ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |